ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం

ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం

కోల్‌కతా విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. బుధవారం (మార్చి 27)న ఉదయం రెండు విమానాలు దగ్గరగా వచ్చి ఒకదానికొకటి రెక్కలు ఢీకొన్నాయి. రన్‪వే  మీద దర్భంగా వెళ్లడానికి క్లియరెన్స్ కోసం వేచి ఉన్న ఇండిగో విమానాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం వచ్చి ఢీకొట్టింది. ఇండిగో విమానంలో నలుగురు చిన్నారులతో సహా 135 మంది ప్రయాణికులు ఉన్నారు.

అదృష్టశాత్తువు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెను ప్రమాదం తృటిలో తప్పింది. డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివల్ ఏవియేషన్ ఈ ఘటనపై సీరియస్ అయింది. రెండు ఫ్లైట్స్ పైలట్లును విధుల నుంచి తొలగించి.. వివరణ ఇవ్వాలని కోరింది. ఈ యాక్సిడెంట్ లో  ఇండిగో విమానం ఎడమవైపు ఉన్న రెక్క  విరిగిపోయి రన్ వే పై పడింది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కుడివైపు ఉన్న రెక్క ఒంగిపోయింది.