IndiGo flight: విమానం గాల్లో ఉండగానే ప్యాసింజర్ మృతి..అత్యవసర ల్యాండింగ్

IndiGo flight: విమానం గాల్లో ఉండగానే ప్యాసింజర్ మృతి..అత్యవసర ల్యాండింగ్

విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికురాలు మృతిచెందిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ముంబైనుంచి వారణాసికి వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో  ప్రయాణిస్తున్న సుశీలాదేవీ (87) అనే మహిళా ప్రయాణికురాలు అనారోగ్యంతో ఫ్లైట్ గాల్లో ఉండగానే మృతిచెందింది. 

ప్రయాణీకురాలు ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన సుశీలా దేవి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అస్వస్థతకు గురైంది. దీంతో మహారాష్ట్రలోని శంభాజీనగర్ లోని చికల్తానా ఎయిర్ పోర్టులో విమానాన్ని ఆదివారం రాత్రి 10గంటల సమయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 

సుశీలా దేవిని వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. విమానయాన సంస్థ ప్రకారం, మహిళ మృతదేహాన్ని ఛత్రపతి సంభజినగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపారు.