విమానంలో సాంకేతిక లోపం.. గంట నుంచి లోపలే సీఎం రేవంత్, మంత్రులు

ముంభైలో ఈరోజు జరగనున్న రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆయనతోపాటు మంత్రులు భట్టి, పొన్నం ప్రభాకర్ శంశాబాద్ ఏయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఏఐసీసీ స్టేట్ ఇంచార్జి దీపాదాస్ మున్షి కూడా విమానంలోనే ఉన్నారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా గంట నుంచి ఇండిగో ఫ్లైట్ బయలుదేరలేదు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, దీపాదాస్ మున్షి విమానంలోనే ఉన్నారు. 2.30కి వెళ్లాల్సిన విమానం ఇంకా ఎయిర్ పోర్ట్ లోనే ఉంది. దీంతో సీఎం ముంభై పర్యటన ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  విమానంలో తలెత్తిన సమస్యను టెక్నికల్ టీం పరిష్కరిస్తోంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ ముంభై పర్యటనకు బయలుదేరున్నారు.