శంషాబాద్, వెలుగు: ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు రావడంతో ఇండిగో విమానాన్ని 6 గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. కోయంబత్తూర్ టు చెన్నై వయా హైదరాబాద్ ఇండిగో విమానం గురువారం శంషాబాద్‌కు వచ్చింది. 181 మంది ప్యాసింజర్లతో టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా, ఎయిర్‌పోర్టు అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు.
దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్, ఆర్జీఐఏ పోలీసులు బాంబు స్క్వాడ్ ఆరు గంటలపాటు విమానాన్ని తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్ధారించిన తర్వాత ఫ్లైట్‌ను టేకాఫ్‌కు అనుమతించారు.