
హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది విమానయాన సంస్థ ఇండిగో. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి సౌదీలోని మదీనా కు డైరెక్ట్ విమాన సర్వీసులను నడపనుంది.తొలి ఫైట్ ను శుక్రవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వారానికి మూడు సార్లు సోమ, గురు, శనివారాల్లో కొత్త సర్వీసును నడపనున్నారు. అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచేందుకు తక్కువ ఛార్జీలతో ఇండిగో కొత్త సర్వీసును ప్రారంభించిందని హైదరాబాద్ నుంచి మదీనాకు 5గంటల 47 నిమిషాలు పడుతుందని సంస్థ తెలిపింది. తొలి విమానం ఫిబ్రవరి 20, గురువారం నాడు ఎంతో ఉత్సాహంగా బయలుదేరిందని GHIALఅధికారులు తెలిపారు.
GMR GHIAL CEO ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ..మదీనాకు ఇండిగో తొలి విమాన సర్వీసును స్వాగతించారు. కనెక్టివిటీని విస్తరించడంలో ,ప్రయాణీకులకు సజావుగా ప్రయాణాన్ని అందిస్తున్నామన్నారు.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మదీనాకు కొత్త డైరెక్టు విమానాలు ఇండియా ,సౌదీ అరేబియా మధ్య మతపరమైన,సాంస్కృతిక సంబంధాలను పెంచుతాయని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా అన్నారు.
ఇండిగో ఇప్పటికే సౌదీలోని నాలుగు గమ్యస్థానాలకు వారానికి 100కి పైగా విమానాలను నడుపుతోంది. తక్కువ ధరల్లో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని మల్లోత్రా అన్నారు.