మరీ ఇంత దిగజారుడా.. పోస్ట్ డిలీట్ చేయమని రూ.6 వేల లంచం ఆఫర్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్

మరీ ఇంత దిగజారుడా..  పోస్ట్ డిలీట్ చేయమని రూ.6 వేల లంచం ఆఫర్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్

సంస్థలు కస్టమర్లకు సర్వీస్ ఇవ్వడంలో ఒక్కోసారి ఫెయిలవుతుంటాయి. నష్టపోయామని చెప్పినా కొన్ని సార్లు పట్టించుకోవు. అలాంటప్పుడు ఎలా చెబితే స్పందిస్తారో అలాగే చెప్పాడో యువకుడు. తను ఫ్లైట్ మిస్సయ్యానని, దీనికి కారణం ఇండిగో ఎయిర్ లైన్స్ చేసిన పొరపాటేనని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ‘‘బాబ్బాబు.. పోస్ట్ డిలీట్ చెయ్.. కావాలంటే 6 వేల రూపాయలు లంచం ఇస్తాం’’ అని ఆఫర్ చేశారట. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రఖర్ గుప్త అనే ప్యాసెంజర్ ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం ఉదయం 6.45 గంటలకు ఉండగా.. 6.30 కే టాకాఫ్ అయ్యిందట. టైమింగ్స్ లో మార్పుల గురించి ఎవరూ ఇన్ఫామ్ చేయలేదు. ఫ్లైట్ బయల్దేరే రెండున్నర గంటల ముందు మెసేజ్ పంపారట. సడెన్ గా షెడ్యూల్ ఛేంజ్ చేయడంతో ఫ్లైట్ ను క్యాచ్ చేయలేకపోయానని, తనకు న్యాయం చేయాలని అధికారులను ప్రశ్నించాడు ప్రఖర్. దీనికి సంస్థ నుంచి రిప్లై రాకపోవడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడట. 

ఎక్స్ లో 80 వేల ఫాలోవర్లు.. పోస్ట్ వైరల్.. లంచం ఆఫర్

ప్రఖర్ గుప్తాకు ఎక్స్ లో 80 వేల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో పోస్ట్ వైరల్ అయ్యింది. సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తుందనుకున్నారో ఏమో.. వైరల్ అయిన తర్వాత ప్రఖర్ కాల్ చేశారు అధికారులు. ‘‘ఎక్స్ లో పోస్ట్ తొలగిస్తే 6 వేల రూపాయలు ఇస్తాం.. పోస్ట్ తొలగించండి ’’అని ఫోన్ చేశారట.

Also Read :- రిపబ్లిక్ డే 2025..థీమ్, ముఖ్యఅతిథి, చరిత్ర, ప్రాముఖ్యత

ఇండిగో ఉద్యోగులు లంచం ఇవ్వజూపిన అంశాన్ని కూడా ఎక్స్ లో పోస్ట్ చేశాడు ప్రఖర్. పోస్ట్ వైరల్ కావడంతో ఇండిగో హెడ్ ఆఫీస్ కలగజేసుకుందని, కానీ ఎలాంటి న్యాయం జరగలేదని తెలిపాడు. 

రిపబ్లిక్ డే వలన షెడ్యూల్ మారిందని, అన్ని ఫ్లైట్స్ షెడ్యూల్స్ మారాయని.. ప్రఖర్ కు న్యాయం చేస్తామని సంస్థ ప్రకటించింది. తమ ఉద్యోగులు లంచం ఆఫర్ చేయడం పొరపాటేనని, చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.