మహారాష్ట్రలోని నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో పైలెట్ మృతి చెందాడు. నాగ్‌పూర్ విమానాశ్రయం బోర్డింగ్ గేట్ వద్ద ఇండిగో పైలట్ కుప్పకూలిపోయాడు. నాగ్‌పూర్ -పుణె విమానాన్ని (6E135) నడిపేందుకు వెళ్తున్న ఇండిగో పైలట్ బోర్డింగ్ గేట్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వివరాల ప్రకారం ఇండిగో పైలెట్ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో కుప్పకూలిపోయినప్పుడు అతనికి CPR అందించారు. అయినా కోలుకోలేదు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఇండిగో ప్రకటన..
"ఈరోజు తెల్లవారుజామున నాగ్‌పూర్‌లో మా పైలట్‌లలో ఒకరు మరణించినందుకు మేము బాధపడుతున్నాం. అతను నాగ్‌పూర్ విమానాశ్రయంలో అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించినా..అప్పటికే అతను దురదృష్టవశాత్తు మరణించాడు. మా పైలెట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం...అని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటన విడుదల చేసింది.
ఇండిగో పైలెట్ మృతితో నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో విమానం 14 నిమిషాల ఆలస్యంగా బయలుదేరింది.