ఇండిగో నష్టం రూ. 986 కోట్లు

ఇండిగో నష్టం రూ. 986 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో  సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల్లో (క్యూ2)  రూ.986.7 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. విమానాల గ్రౌండింగ్,  అధిక ఇంధన ఖర్చులు తీవ్ర ప్రభావం చూపాయి.  2023 సెప్టెంబర్ క్వార్టర్​లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లాభం రూ.188.9 కోట్లుగా ఉంది.  విదేశీ మారకద్రవ్య ప్రభావం మినహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో ఇండిగో నష్టం రూ.746.1 కోట్లుగా నమోదైందని ఒక ప్రకటనలో తెలిపింది.  

సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ​ దగ్గర 410 విమానాలు ఉన్నాయి.  తాజా క్వార్టర్​లో ఇంధన ఖర్చులు 12.8 శాతం పెరిగి రూ.6,605.2 కోట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.5,856 కోట్లుగా ఉన్నట్టు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ తెలిపింది.  రెండో క్వార్టర్​లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్  ఇంజన్ రెంటల్స్ రూ.195.6 కోట్ల నుంచి రూ.763.6 కోట్లకు పెరిగాయి.  మొత్తం ఖర్చులు దాదాపు 22 శాతం పెరిగి రూ.18,666.1 కోట్లకు చేరుకున్నాయి.  సెప్టెంబర్ క్వార్టర్​లో, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ 27.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. వీరి సంఖ్య వార్షికంగా దాదాపు 6 శాతం  పెరిగింది.