స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: తెలంగాణలో సీఎం కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం సమక్షంలో బీఆర్ఎస్ మహిళా నియోజకవర్గ కోఆర్డినేటర్ కుందూరు జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్లు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీంలపై వస్తున్న ప్రజాదరణ చూసిన కేసీఆర్‌కు మైండ్ బ్లాకై ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు.
Also Read :- హైదరాబాద్ లో పాకిస్తాన్ ఫ్యాన్స్
మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, రాజయ్య హయాంలో స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధిలో జీరోగానే ఉందన్నారు. కాంగ్రెస్ కిసాన్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్‌చందర్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ చింత ఎల్లయ్య, మండల అధ్యక్షుడు శిరీష్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.