పాల్వంచ,వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలోని దమ్మపేట సెంటర్ లో మంగళవారం ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందిరా గాంధీ జయంతినినేపథ్యంలో రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ ట్ సొసైటీ చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొందెం వీరయ్య ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకాను న్నారు.
ఈమేరకు సోమవారం పట్టణంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు అధ్యక్షతన సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరా వు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ లో భాగంగా గతం లో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం తొలగించిన నేపథ్యంలో మరో విగ్ర హాన్ని ఏ ర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలు పునిచ్చారు.