
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఎన్బీటీ నగర్ ఎస్ఎల్ఎఫ్-–5 గణేశ్ఎస్ హెచ్‌జీ గ్రూప్‌కు రూ.10 లక్షల బ్యాంక్ లింకేజీ రుణం మంజూరు కాగా, అందులో రూ.5 లక్షలతో ఐదు మంది మహిళలు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, యూసీడీ అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి, డీసీలు ప్రశాంతి, రజినీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.