
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ మహిళలను ప్రభుత్వం వ్యాపారవేత్తలుగా రాణించేలా ప్రోత్సహిస్తోందని, ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల మహిళలతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించి ఉపాధి పొందేలా చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. యూసీడీ అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, డీసీ ప్రశాంతి, స్నేహిత సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.