మా శాఖకు కేంద్ర బడ్జెట్​ లో నిధులు ఎందుకివ్వలేదు..? ఇందిరాపార్క్ వద్ద గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు ధర్నా

మా శాఖకు కేంద్ర బడ్జెట్​ లో నిధులు  ఎందుకివ్వలేదు..? ఇందిరాపార్క్ వద్ద  గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు ధర్నా

కేంద్రప్రభుత్వం బడ్జెట్​ కేటాయింపు విషయంలో  గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థకు నిధులు నిలిపివేతను నిరసిస్తూ.. ఇందిరాపార్క్​ ధర్నాచౌక్​ వద్ద జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ఎంప్లాయిస్ అసోసియేషన్, జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు.  కేంద్రప్రభుత్వం గ్రామీణాభివృద్ది శాఖకు నిధులు కేటాయించకపోవడంతో సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ | తప్పేంటో చూపించమంటే తోక ముడిచారు.. BRS, బీజేపీ సీఎం రేవంత్ ఫైర్

65 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్​ లోనే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని .. కాని ఈ ఏడాది (2025) లో ప్రవేశ పెట్టిన బడ్జెట్​ లో  అకస్మాత్తుగా ఎందుకు  నిధులు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారని.. కేంద్రం ఇప్పటికైనా స్పందించి... నిధులు కేటాయించాలని .. గ్రామీణాభివృద్ది సంస్థ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.