రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: కొత్త ఆలోచనలతో పరిశోధనలు జరగాలని బాబా అణు పరిశోధనా సంస్థ (బార్క్) రిటైర్డ్ సైంటిస్ట్, ముంబై యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇందిరా ప్రియదర్శిని సూచించారు. పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ స్కూల్‌ఆఫ్ సైన్స్ కెమెస్ర్టీ బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం 'సాంకేతిక శాస్ర్తం అభివృద్ధికి ప్రాథమిక పరిశోధన-రసాయన జీవ శాస్ర్తాల సమన్వయం, సవాళ్లు, అవకాశాలు' అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఏ రంగ పరిశోధనలు అయినా జవాబుదారీతనంతో జరగాలని అప్పుడే విప్లవాత్మకమైన పరిష్కారాలు సాధించవచ్చని పేర్కొన్నారు. అనంతరం కర్యుమిన్, సెలినియంలపై తాను చేరిన పరిశోధన ఫలితాలను స్టూడెంట్స్‌తో పంచుకున్నారు. కార్యక్రమంలో కెమిస్ర్టీ హెచ్ వోడీ గౌసియా బేగం, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.