44వ సవరణకు ఇందిర అనుకూలంగా ఓటేశారు: ఎంపీ జైరాం రమేశ్

44వ సవరణకు ఇందిర అనుకూలంగా ఓటేశారు: ఎంపీ జైరాం రమేశ్

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తన సహచర ఎంపీలతో కలిసి 44వ రాజ్యాంగ సవరణకు అనుకూలంగా ఓటువేశారని, ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఎంపీలు ప్రస్తావించలేదని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్  చేశారు. 50 ఏండ్ల క్రితం చేసిన చట్టంలో 42వ సవరణకు సంబంధించి చాలా విషయాలను అలాగే ఉంచారని చెప్పారు. ‘‘రాజ్యాంగంపై చర్చ సందర్భంగా దివంగత ప్రధాని ఇందిరపై ప్రధాని మోదీ, ఆయన సహచర ఎంపీలు విమర్శిస్తున్నారు. 

42వ సవరణ చేసి 1976 డిసెంబరులో చట్టం చేశారని అంటున్నారు. అయితే, 1978 డిసెంరులో 44వ సవరణకు ఇందిర అనుకూలంగా ఓటువేశారు. 1976లో ఇందిర ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణతో పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్  పదాలను చేర్చింది. దాంతో పీఠిక.. సార్వభౌమ, డెమోక్రటిక్  రిపబ్లిక్  నుంచి సార్వభౌమ, సామ్యవాద, లౌకికవాద, డెమోక్రటిక్   రిపబ్లిక్ గా మారింది. 42వ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన చాలా విషయాలను 44వ సవరణలో తొలగించారు” అని రమేశ్  తెలిపారు.