
- ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్లకు కొలతలు వేస్తున్న ఆఫీసర్లు
- 400కు తగ్గినా.. 600 ఎస్ఎఫ్ టీ కంటే పెరిగినా.. పాత గోడకు కలిపినా నో బిల్
- రూల్స్‌కు విరుద్ధంగా 12 ఇండ్ల నిర్మాణాలు
- మార్చుకోవాలని సూచించిన ఆఫీసర్లు
- 45 ఇండ్ల నిర్మాణాలకు రూ.లక్ష చొప్పున ఫస్ట్బిల్లు రిలీజ్
యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆఫీసర్లు స్ట్రిక్‌గా రూల్స్ఫాలో అవుతున్నారు. ఇంటి నిర్మాణాల్లో ఎక్కడా తేడా రాకుండా చూస్తున్నారు. తొలిదశలో బేస్మెంట్ పూర్తయిన ఇంటి నిర్మాణాలకు ఆఫీసర్లు కొలతలు వేస్తున్నారు. ఇంటి నిర్మాణం 400 ఎస్ఎఫ్టీ తగ్గినా.. 600 కంటే పెరిగినా.. పాత గోడకు కలిపినా బిల్లు రాదని చెబుతున్నారు. నిర్మాణంలో రూల్స్‌కు విరుద్ధంగా ఏ మాత్రం తేడా ఉన్న మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే బిల్లు రాదని తేల్చి చెబుతున్నారు.
కొనసాగుతున్న నిర్మాణాలు..
యాదాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతోంది. ప్రజాపాలనతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామసభల్లో ఇండ్ల కోసం జిల్లాలోని 17 మండలాల్లో 2,01,977 అప్లికేషన్లు రాగా, వీటిలో 52,109 ఓకే చేశారు. అయితే అర్హుల జాబితాను మూడు విభాగాలుగా (ఎల్-1, ఎల్-2, ఎల్-3)గా విభజించింది. ఇందులో ఇండ్లు లేకుండా సొంత ఇంటి స్థలం ఉన్న వారిని ఎల్-–1 జాబితాలో చేర్చింది. ఇంటి స్థలం, ఇండ్లు లేనివారిని ఎల్–2లో చేర్చింది. గతంలో ఇండ్లు శాంక్షన్అయిన వారిని, స్లాబ్ ఇండ్లు ఉన్న వారిని ఎల్–3లో చేర్చింది. ఎల్–3 జాబితాలో ఉన్న వారికి ఇండ్లు వచ్చే అవకాశం లేనట్టే.
రూల్స్‌కు విరుద్ధంగా నిర్మాణాలు..
జిల్లాలోని 17 మండలాల్లో ఎంపిక చేసిన 17 గ్రామాల్లో 758 ఇండ్లను శాంక్షన్ చేయగా, 456 ఇండ్లు గ్రౌండింగ్అయ్యాయి. రూల్స్ప్రకారం 400 ఎస్ఎఫ్టీ నుంచి 600 మించకుండా ఇండ్లను నిర్మించుకోవాలని ఆఫీసర్లు చెబుతున్నారు. వీటిలో 83 ఇండ్లు బేస్మెంట్నిర్మాణం పూర్తయింది. అయితే కొందరు ఆఫీసర్లు చెప్పిన కొలతల కంటే ఎక్కువ విస్త్రీర్ణంలో నిర్మాణం చేస్తున్నారు. బేస్మెంట్నిర్మాణం పూర్తయిన వారికి మొదటి విడత బిల్లు రూ.లక్ష చొప్పున అందించడానికి ఆయా గ్రామాలకు వెళ్లి ఆఫీసర్లు కొలతలు వేశారు. వీటిలో 12 ఇండ్లు రూల్స్‌కు విరుద్ధంగా నిర్మించినట్టు తేలింది. వీటిలో కొన్ని 400 ఎస్ఎఫ్టీ కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండగా, మరికొందరు 600 ఎస్ఎఫ్టీని మించి నిర్మించారు. మరికొందరు పాత గోడలను కలుపుకొని నిర్మాణాలు చేశారు. దీంతో ఆ నిర్మాణాలను సరిచేసుకోవాలని, లేకుంటే బిల్లు రాదని ఆఫీసర్లు తేల్చిచెప్పారు.
45 ఇండ్లకు బిల్స్ఓకే..
రూల్స్ ప్రకారం నిర్మించిన 71 ఇండ్లలో 45 మందికి రూ.లక్ష చొప్పున రూ.45 లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ అయ్యాయి. మరో 26 నిర్మాణాలకు బిల్స్రూపొందించి పంపించారు. ఇవి రెండ్రోజుల్లో జమ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
రూల్స్‌కు అనుగుణంగా నిర్మిస్తేనే బిల్లు
ఇందిరమ్మ ఇండ్లను రూల్స్‌కు అనుగుణంగా నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుంది. 400 ఎస్ఎఫ్టీకి తగ్గినా.. 600 మించి పెరిగినా బిల్లు శాంక్షన్కాదు. పాత గోడలను కలుపుకొని నిర్మించినా బిల్స్ రావు.- విజయ్‌సింగ్, పీడీ. హౌసింగ్, యాదాద్రి