ఎడపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన

ఎడపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను బోధన్​ సబ్ కలెక్టర్ వికాస్​మహతో శుక్రవారం పరిశీలించారు.   గ్రామంలోని పలువురి ఇండ్ల వద్దకు వెళ్లి సర్వే తీరును పరిశీలించి సిబ్బందికి  పలు సూచనలు చేశారు. అర్హులైన వారిని గుర్తించేందుకు వివరాలను పరిశీలించి యాప్​లో నమోదు చేయాలన్నారు.  

అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.  సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవలందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శంకర్, పంచాయతీ విస్తీర్ణ అధికారి శాస్త్రి, పంచాయతీ సెక్రటరి నాగరాజ్​ గౌడ్​తదితరులు ఉన్నారు.