హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతోంది. సిటీలోని 10 లక్షల 70 వేల446 మంది ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. డివిజన్ల వారీగా టీమ్ లను ఏర్పాటు చేసి, సిబ్బందికి ప్రత్యేకంగా 883 లాగిన్ ఐడీలు కేటాయించారు.
ఇప్పటి వరకు 94 వేల దరఖాస్తులకు పైగా సర్వే పూర్తయింది.