
నారాయణపేట, వెలుగు; అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలన్నారు. నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇందిరమ్మ ఇండ్లను అర్హులందరికీ వచ్చేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం భూ భారతి పై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రజల అవగాహన కార్యక్రమాల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెంషాలం, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.