కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు–చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మిడ్​ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినందుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతఙ్ఞతలు తెలిపారు.   బీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతుల నుంచి విలువైన భూములు లాక్కొని రోడ్డున పడేస్తే... కాంగ్రెస్​ ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు,  కాంగ్రెస్​ పార్టీ మాట ఇస్తే తప్పదని మరోసారి రుజువైందన్నారు.


మిడ్​ మానేరు  నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో తాను రైతుల పక్షాన పోరాటం చేస్తే.. చొప్పదండి కాంగ్రెస్​ ఇన్​చార్జిగా అనేక సమస్యలు ఎదుర్కొన్నానన్నారు.  ప్రజా ప్రభుత్వంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.