నారాయణ్ ఖేడ్,వెలుగు: నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరుచేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ ఎంపీపీ ఆఫీసు ముందు మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివన్నారు. రేపటి నుంచి అధికారులు గ్రామ సభల ద్వారా అప్లికేషన్స్ తీసుకోవాలని సూచించారు.
పెద్ద శంకరంపేట మండలంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కొత్త అంబులెన్స్ సర్వీస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితిలో వైద్యం అందించేందుకు అంబులెన్స్ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ లీడర్లు రమేశ్ చౌహన్, పండరిరెడ్డి, మెదక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భవాణి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.