అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు​ : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు​ : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అడబిడ్డలకు కల్యాణలక్ష్మి అందిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఆలేరు, మోత్కూరు మండలం పాటిమట్ల, వలిగొండలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి వారు వేర్వేరుగా మాట్లాడారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల మోడల్​హౌస్​ను ఐలయ్య పరిశీలించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పునాది తీయగా, 73 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కుంభం అందజేశారు.