టెక్స్​టైల్​ పార్క్​ రైతులకు ఇందిరమ్మ ఇండ్లు

టెక్స్​టైల్​ పార్క్​ రైతులకు ఇందిరమ్మ ఇండ్లు
  • 863 మందికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ

వరంగల్​, వెలుగు: వరంగల్​ గీసుగొండలోని కాకతీయ మెగా టెక్స్​టైల్​ పార్క్​ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన 863 మంది రైతులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్​ 29న సీఎం రేవంత్​రెడ్డి టెక్స్​టైల్​ పార్క్​ సందర్శించిన సందర్భంగా భూములు ఇచ్చిన బాధిత రైతులు తమ కుటుంబాలకు ఇండ్లు, ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.

దీనిపై ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో ఏకంగా 863 మంది రైతులకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఒకేసారి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఆర్అండ్​బీ సెక్రటరీ డాక్టర్​ జ్యోతి బుద్దప్రకాశ్​ ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల తరపున పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.