హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారుల ఎంపికకు కీలక అడు గు పడింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి యాప్‌ను లాంచ్ చేస్తారు. అనంతరం లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ అవుతుంది. ఇందుకు హౌసింగ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం సెక్రటేరియట్లో స్టేట్ హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్అధికారులతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా యాప్ పనితీరు పరిశీ లించారు. దీన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) రూపొందించింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వివరాలను ఎంట్రీ చేసి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ను జిల్లా అధికారులు లాగిన్ అయ్యేలా వీలు కల్పిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల అప్లికేషన్లు రాగా, ఇందులో డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లు పొందిన అప్లికేషన్లను తొలగించగా 68 లక్షలు తేలాయి. వీరిని గ్రామసభలో ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసి అర్హులను ప్రకటిస్తుంది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, ఇన్చార్జ్ మంత్రి అప్రూవల్ అనంతరం కలెక్టర్ ఆమోదిస్తారు. తొలి దశలో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3,500 ఇండ్ల చొప్పున ఏడాదికి 4.16లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 100 శాతం సబ్సిడీతో 4 దశల్లో రూ.5 లక్షలు అందించనుంది.