ఇండో- నేపాల్​ తైక్వాండో చాంపియన్ కృతికారెడ్డి

ఇండో- నేపాల్​ తైక్వాండో చాంపియన్ కృతికారెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్​స్టేడియంలో జరిగిన ఫస్ట్​ఇండో– నేపాల్​తైక్వాండో ఇంటర్నేషనల్​చాంపియన్​షిప్​లో కృతికారెడ్డి విజేతగా నిలిచింది. సిటీకి చెందిన ఎం.విజయవర్ధన్​రెడ్డి, వరలక్ష్మి దంపతుల కుమార్తె కృతికారెడ్డి ఈ పోటీల్లో గోల్డ్​మెడల్​సాధించింది. 

అసోసియేషన్​ఆఫ్​ తెలంగాణ త్వైక్వాండో, జయంత్​రెడ్డి ఇంటర్నేషనల్​తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27వ తేదీల్లో ఈ పోటీలు నిర్వహించారు. కృతికారెడ్డి ఒయాసిస్​స్కూల్​లో ఎనిమిదో తరగతి
 చదువుతోంది.