మైనస్ డిగ్రీల టెంపరేచర్లో జవాన్ల పెట్రోలింగ్

మైనస్ డిగ్రీల టెంపరేచర్లో జవాన్ల పెట్రోలింగ్

సరిహద్దుల్లో శత్రువులు, ఉగ్రవాదులతోనే కాకుండా ప్రతికూల వాతావరణంతో జవాన్లు పోరాడుతున్నారు. మైనస్ డిగ్రీల చలిలో, గడ్డ కట్టుకుపోయేంతలా ఉన్న మంచులో బార్డర్ లో పహారా కాస్తున్నారు. మోకాళ్లకు పైగా లోతులో దిగపడిపోయే మంచులో.. అడుగు తీసి అడుగు ముందుకేయలేని క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా మన కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ సైనికుల కష్టం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి.  

ఉత్తరాఖండ్ సమీపంలోని హిమాలయాల్లో ఇండో టిబెటన్–బార్డర్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. 15 వేల అడుగుల ఎత్తులోని మంచు ప్రాంతంలో ఐటీబీపీ జవాన్లు పెట్రోలింగ్ చేస్తున్నారు. అతి తక్కువ ఉష్ణోగ్రతలో, మోకాళ్ల లోతు మంచులో మొక్కవోని దీక్షతో విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క అడుగు ముందుకు వేయడానికి వాళ్లు పడుతున్న కష్టాన్ని వీడియోలో చూడొచ్చు. భుజాన తుపాకుల మోస్తూ.. కర్ర లాంటి వస్తువును ఊతంగా చేసుకుని ముందుకు సాగుతున్న జవాన్లకు సెల్యూట్ చేయకుండా ఉండలేం. 

మరిన్ని వార్తల కోసం:

భగవంత్ మాన్ ఓ తాగుబోతు 

రూపాయికే గులాబీ దోశ

చనిపోయిన వ్యక్తికి బూస్టర్ వేశారట!