Apple iPhone 16: ఇండోనేషియాలో Apple ఐఫోన్ 16 బ్యాన్..ఎందుకంటే..

Apple  iPhone 16: ఇండోనేషియాలో Apple  ఐఫోన్ 16 బ్యాన్..ఎందుకంటే..

ఇండోనేషియా ప్రభుత్వం ఆ దేశంలో ఆపిల్ ఐఫోన్ 16 అమ్మకాలను  నిషేధించింది. అంతేకాదు.. విదేశాలనుంచి కూడా ఈ ఐఫోన్ 16 లను తెప్పించుకొని వాడొద్దని హెచ్చరించింది. ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయంతో టెక్ దిగ్గజం ఒక్క సారిగా షాక్ అయింది.  

తమ దేశంలో ఆపిల్ ఐఫోన్ 16 ను నిషేధిస్తున్నట్లు మంగళవారం ( అక్టోబర్ 22) ఇండోనేషియా ఇండస్ట్రీయల్ మినిస్టర్ అగస్ గుమివాంగ్ ప్రకటించారు.  ఐఫోన్ 16 అమ్మకాలను నిషేధించడంతోపాటు విదేశాలనుంచి కూడా ఈ డివైజ్ లను కొనుగోలు చేయకుండా అక్కడి ప్రజలను హెచ్చరించారు. చట్టప్రకారం ఇండోనేషియాలో ఐఫోన్ 16 వినియోగించడం నేరంగా పరిగణించబడుతుందని చెప్పారు. 

ఐఫోన్ 16 ను ఎందుకు నిషేధించారంటే.. 

ఐఫోన్ 16 ను ఎందుకు నిషేధించారంటే.. యాపిల్ కంపెనీ ఇండోనేషియా పెట్టుబడుల చట్టాన్ని ఉల్లంఘించడమే ఇందుకు కారణమట. ఒప్పందం ప్రకారం.. ఆపిల్ 1.71 ట్రిలియన్ రూపాయల పెట్టుబడులు పెట్టాల్సి ఉండగా.. కేవలం 1.48 ట్రిలియన్ రూపాయలు ( 95మిలియన్ డాలర్లు) మాత్రమే పెట్టుబడి పెట్టిందట. దాదాపు 230 బిలియన్ రూపాయల పెట్టుబడి తగ్గిందట. దీంతో పాటు డోమెస్టిక్ కాంపోనెంట్ లెవెల్ సర్టిఫికేషన్ ఇంకా పెండింగ్ లోనే ఉందట. 

ALSO READ | iPhone 16 Camera Controls:ఐ ఫోన్ 16 సిరీస్‌లో ఫీచర్స్ అదుర్స్ కెమెరా ఆప్షన్స్ చూస్తే షాక్

TKDN సర్టిఫికేషన్ కోసం ఆపిల్ కనీసం 40 శాతం లోకల్ కంటెంట్ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఆపిల్ తదుపరి పెట్టుబడి కోసం ఎదురు చూస్తోంది. ఇండేనే షియా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఫెసిలిటీ ఏర్పాటును కంపెనీ పరిశీలిస్తోందని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. 

సెప్టెంబర్ లో భారత దేశంలో లాంచ్ చేయబడిన ఐఫోన్ 16 కు మంచి డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో జనం ఎగబడి కొంటున్నారు. ఇదిలా ఉంటే ఇండేనేషియాలో ఐఫోన్ 16 పై నిషేధం ఆగ్నేషియా మార్కెట్ లో ఆపిల్ కు గట్టి దెబ్బే తగిలినట్లయింది.