ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర ప్రాంతంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదల ప్రభావంతో 21 మంది ప్రాణాలు కోల్పో యారు.వరదల్లో ఏడుగురు గల్లంత య్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 150 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపు 70వేల మంది నిరాశ్రయులయ్యారు.
నిరాశ్రయకులైన వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. గురువారం ( మార్చి 7)నుంచి వరదలు బీభత్సం సృష్టించగా.. పడాంగ్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో దాదా పు 200 ఇళ్లు నేలమట్టం అయ్యాయి.వంతెనలు, రోడ్లు దెబ్బతి న్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా మార్గాలు మూసుకుపోయాయి. వరద నీరు తగ్గినా.. కొండచరియలు పడటంతో సహాయ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు.ప్రస్తుతం పడాంగ్ ప్రాంతం మొత్తం ఇంకా నీటిలోనే ఉంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు