ఒక్క రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు..

ఒక్క రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు..

బాలీ: విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో సంచలనం నమోదైంది. ఇండోనేసియా స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహ్మలియా ఒక్క రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు (3.2-–3–0–7) తీసి పెను సంచలనం సృష్టించింది. మంగోలియాతో బుధవారం రాత్రి జరిగిన ఐదో టీ20లో ఈ ఫీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదైంది. దీంతో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్​గా నిలిచింది. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫునా ఇలాంటి స్టాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదు కాలేదు. ఇప్పటివరకు మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్యాజుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇద్రుస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4–1–8–7), విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్రెడ్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్డిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4–2–3–7) బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టారు.  

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఇండోనేసియా 20 ఓవర్లలో 151/5 స్కోరు చేసింది. నంద సకారిని (61), హిల్వా నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19), రోహ్మలియా (13), మూర్తియార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (13) రాణించారు. మెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బయార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4 వికెట్లు తీసింది. తర్వాత ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన మంగోలియా 16.2 ఓవర్లలో 24 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. రోహ్మలియా ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోమంగోలియా లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పేకమేడలా కూల్చింది. అద్భుతమైన టర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబడుతూ వరుస విరామాల్లో వికెట్లు తీసింది. 3.2 ఓవర్లు వేసిన ఆమె ఒక్క రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వకపోవడం విశేషం. రోహ్మలియా దెబ్బకు ఏడుగురు డకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు.