
- ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన
మెదక్, వెలుగు: ఇండోనేషియా, ఫ్రాన్స్ దేశాల నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. వెంకటాపూర్ గ్రామంలో తుకారాంకు చెందిన అయిదున్నర ఎకరాల ఆయిల్ పామ్ తోటను సందర్శించారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే విధానం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, చీడపీడల యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఎక్కువ దిగుబడి పొందాలంటే తాము ఇచ్చిన సిరాడ్ డెలి లామే రకం సీడ్ వాడాలని చెప్పారు.
తక్కువ నీటి సదుపాయం ఉన్న నేలలో మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. రైతులు సంప్రదాయ రకాల కంటే అత్యధిక దిగుబడిని పొందవచ్చని తెలిపారు. ఈ సదస్సులో పామ్ ఎలైట్ కంపెనీ నిపుణులు నికోలస్ టర్నబుల్, అంబర్ ఫాబింగ్, శ్రీవిజియన్, లివ్ పామ్ కంపెనీ సాంకేతిక సలహాదారు వైయస్ రంగనాయకులు, ప్రాజెక్టు మేనేజర్ కృష్ణ, లివ్ పామ్ సిబ్బంది పాల్గొన్నారు.