వారంలో రెండో సారి పేలిన అగ్నిపర్వతం..

ఇండోనేషియాలో మరోసారి అగ్ని పర్వతం బద్దలయ్యింది. ఇండోనేషియాలోని మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఏప్రిల్ 30న తెల్లవారుజామును అగ్నిపర్వతం  పేలింది. అగ్నిపర్వతం   బద్దలై ఆకాశంలోకి దాదాపు 2 కిలోమీటర్ల మేర బూడిదతో కమ్మేసింది. భారీగా లావా బయటకు వచ్చింది. సముద్రంలోకి లావా జారిపడుతుండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరలించారు. అగ్నిపర్వతం పేలడంతో  ప్రజలు  బిలం నుండి  6 కిలోమీటర్ల దూరంలో ఉండాలని అధికారులు కోరారు.  విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇండోనేషియాలో  అగ్ని పర్వతం బద్దలవడం  రెండు వారాల్లో రెండోసారి.