కీబోర్డులో ఇందూర్​ బిడ్డ గిన్నిస్​ రికార్డు

కీబోర్డులో ఇందూర్​ బిడ్డ గిన్నిస్​ రికార్డు

నిజామాబాద్, వెలుగు: నాన్​స్టాప్​గా కీబోర్డు వాయించి గిన్నిస్​బుక్​ఆఫ్​రికార్డు సాధించాడు ఇందూర్ కు చెందిన స్కూల్ విద్యార్థి.  సిటీలోని రాజీవ్​నగర్​కాలనీకి చెందిన బోగం బాలరాజ్, అనితల  కొడుకు ​విజయ్​రాజ్(14) స్థానిక ఎస్ఎఫ్ఎస్​ హైస్కూల్​లో తొమ్మిదో క్లాస్​చదువుతున్నాడు. కీ బోర్డుపై ఇష్టం పెంచుకుని కొద్ది కాలంలోనే పట్టు సాధించాడు. హైదరాబాద్​లోని అంతర్జాతీయ హలెల్​ మ్యూజిక్​ స్కూల్​మేనేజ్​మెంట్​కీ బోర్డు ఈవెంట్​లో గిన్నిస్​ రికార్డుకు ఎనిమిది దేశాల నుంచి ఎంట్రీలు ఆహ్వానించింది. 

మొత్తం 1,046 మంది పేర్లు నమోదు చేసుకోగా.. ఏడాది పాటు ఆన్​లైన్​ కీబోర్డ్​ ప్లేయింగ్​లో  శిక్షణ ఇచ్చింది.  2024 డిసెంబర్​1న 1,046 మందితో ఒకే టైంలో గంట పాటు ఆన్​లైన్​లో నాన్​స్టాప్​ కీబోర్డు ప్లే ఈవెంట్​ను హలెల్​ మ్యూజిక్​ స్కూల్​నిర్వహించింది.  అనంతరం గిన్నిస్​లో చోటు కోసం ప్రోగ్రామ్ ను పంపింది. దీంతో గిన్నిస్ బుక్​ఆఫ్​రికార్డ్స్​ ప్రతినిధులు విజయ్​రాజ్​ను ఎంపిక చేశారు.  సోమవారం హైదరాబాద్​లోని మణికొండలో నిర్వహించిన ప్రోగ్రామ్ లో గిన్నిస్ సంస్థ ప్రతినిధి ఆగస్టీన్​సర్టిఫికెట్,​ మెడల్​ అందించారు.