ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి షాక్.. చివరి నిమిషంలో బీజేపీతో కలిసి నామినేషన్ విత్ డ్రా

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్  షాక్ తగిలింది.. ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అక్షయ్ కాంతి.. చివరి నిమిషంలో తన  నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అది కూడా బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ తో కలిసి వెళ్లి.. తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.  అంతేకాకుండా ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేలో చేరారు.  ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని  కేబినెట్ మంత్రి కైలాష్ విజయవర్గియా వెల్లడించారు.  కైలాష్ విజయవర్గియా, అక్షయ్ బామ్‌తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో ఓ ఫోటను పోస్టు చేయగా అది ఇప్పడు వైరల్ గా మారింది.  

ఇండోర్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలయ్యాయి.  అక్షయ్‌కాంతి బామ్‌ ఏప్రిల్‌ 24న నామినేషన్‌ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తులు రూ.57 కోట్లుగా పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి రోజు కావడంతో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు అక్షయ్‌కాంతి . కాగా ఇండోర్ లో లోక్‌సభ ఎన్నికలకు మే 13న ఓటింగ్ నిర్వహించి, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా  ఇటీవల, గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకపక్షంగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని తన నామినేషన్‌ను ఒకరోజు ముందుగానే ఉపసంహరించుకున్నారు.  ఆ కాసేపటికి స్వంతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. 

Also Read:కేసీఆర్ పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు