రోడ్లపై చెత్త వేస్తే లక్షల్లో ఫైన్​ వేస్తున్నం: ఇండోర్ మేయర్ పుష్యమిత్ర

రోడ్లపై చెత్త వేస్తే లక్షల్లో ఫైన్​ వేస్తున్నం: ఇండోర్ మేయర్ పుష్యమిత్ర
  • తడి, పొడి చెత్తను వేరు చేయడంలో సక్సెస్​ అయ్యాం
  • గ్రేటర్​ మేయర్, కార్పొరేటర్లకు వివరించిన ఇండోర్ మేయర్ పుష్యమిత్ర 

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టడీ టూర్​లో ఉన్న జీహెచ్ఎంసీ మేయర్ బృందం బుధవారం మధ్యప్రదేశ్​లోని ఇండోర్ సిటీలో పర్యటించింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు 40 మంది కార్పొరేటర్లు ఇందులో ఉన్నారు. ఈ సందర్భంగా ఇండోర్ మేయర్ పుష్యమిత్ర మాట్లాడుతూ..అక్కడి పరిశుభ్రత కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. 

ఇతర నగరాల నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని అమలు చేస్తున్నామన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా కలెక్ట్​చేయడంలో సక్సెస్​అయ్యామని, రూల్స్​బ్రేక్​చేసిన వారిపై భారీ జరిమానాలు వేస్తున్నామని వివరించారు. పబ్లిక్​ప్లేసుల్లో చెత్త వేస్తే లక్షల్లో ఫైన్లు​విధిస్తున్నామన్నారు. రోజుకు 1,300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తే 550 మెట్రిక్ టన్నులు బయోగ్యాస్ (సీఎన్​జీ) ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు వెళ్తుందని, మిగతాది రికవరీ ఫెసిలిటీకి వెళ్తుందన్నారు. 

మేయర్​విజయలక్ష్మి మాట్లాడుతూ ఇండోర్‌‌‌‌‌‌‌‌లో తలసరి వ్యర్థాల ఉత్పత్తి 400 మెట్రిక్ టన్నులు అయితే, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రోజుకు 6,500 మెట్రిక్ టన్నులు అని చెప్పారు. వ్యర్థాల సేకరణను ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వకుండా, తమ ఉద్యోగుల ద్వారా నియంత్రించడంలో ఇండోర్ అనుసరిస్తున్న క్రమబద్ధమైన విధానం బాగుందని  మేయర్, కార్పొరేటర్ల బృందం అభినందించింది.

షిల్లాంగ్​లో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

పద్మారావునగర్:జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్​మోతె శ్రీలతారెడ్డి, మహిళా కార్పొరేటర్లు స్టడీ టూర్​లో భాగంగా బుధవారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో పర్యటించారు.అక్కడి మున్సిపల్ బోర్డును సందర్శించారు.పాలక వర్గం చేపడుతున్న కార్యక్రమాలు, అంశాలను తెలుసుకున్నారు. డిప్యూటీ మేయర్​వెంట కార్పొ రేటర్లు కంది శైలజ, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి తదితరులు ఉన్నారు.