ఎంపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి జనవరి 18న ఉదయం ఇండోర్‌లోని కోచింగ్ క్లాస్‌లో పాఠాలు వింటుండగా గుండెపోటుతో మరణించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇండోర్‌లోని భవార్‌కువాలో ఉన్న కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ఘటన జరిగింది.
రాజా అనే 18 ఏళ్ల విద్యార్థి మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందినవాడు. ఉన్నత చదువుల కోసం ఇండోర్‌కు వెళ్ళాడు. అతను ప్రస్తుతం మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రోజూ మాదిరిగానే, అతను ఈరోజు ఉదయం కోచింగ్‌కు హాజరయ్యాడు. ఈ ఘటన అంతా తరగతి గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థులు ఇతర క్లాస్‌మేట్‌ల మాదిరిగానే కుర్చీపై కూర్చుని చదువుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా, అతను తన ఛాతీలో విపరీతమైన నొప్పితో బాధపడటం ప్రారంభించాడు. సెకన్లలోనే అతను కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. భయాందోళనకు గురైన అతని బ్యాచ్‌మేట్స్ వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఘటన అనంతరం విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి వచ్చారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తమకు పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజీని అందించడం లేదని వారు ఆరోపించారు. కాగా విద్యార్థి తండ్రి పీహెచ్‌ఈ విభాగంలో పనిచేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.