సహకార రంగాన్ని కాపాడుకోవాలి : కొండలసాయిరెడ్డి

నిజామాబాద్​రూరల్, వెలుగు: జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న సహకార రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇందూరు పరస్పర సహకార పరపతి చక్కెర సంఘం చైర్మన్​కొండలసాయిరెడ్డి పేర్కొన్నారు. చక్కెర సంఘానికి ఎండీగా డాక్టర్​రవీందర్​ బాబు, చీఫ్​అగ్రికల్చర్​ఆఫీసర్​గా సురేందర్​రెడ్డి, చీఫ్​ ఇంజినీర్​గా భూమేశ్వర్, పీఆర్వోగా సాయినాథ్​రెడ్డిలని నియమించారు. సోమవారం వీరు తమ విధుల్లో చేరారు.

ఈ సందర్భంగా చైర్మన్​ సాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతురాజ్యాన్ని తీసుకొస్తామని పదేపదే చెప్పే సీఎం కేసీఆర్​సహకార రంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. తెలంగాణలోనే ప్రాముఖ్యతను కలిగిన ఎన్​సీఎస్ఎఫ్​ను రైతులకు అప్పగిస్తే లాభాల బాటలో నడుపుతామన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకునే నాథులు లేరన్నారు.