ఫోన్ చూడనివ్వనందుకు పేరెంట్స్పై పిల్లలు కేసు: కోర్టుకెక్కిన తల్లిదండ్రులు

యూత్..అతి సున్నిత స్వభావం ఇండోర్ లో తల్లిదండ్రులను కోర్టుకు ఎక్కించింది. స్క్రీన్ టైమ్ ను పరిమితం చేసినందుకు పేరెంట్స్ పై కేసు పెట్టారు ఇద్దరు పిల్లలు. మొబైల్ ఫోన్, టీవీని ఎక్కువగా చూడటంపై తల్లిదండ్రులు ఆంక్షలు పెట్టడం, తల్లిదండ్రులు ఎప్పుడూ తిట్టడం వంటి కారణాలతో అక్కాతమ్ముడు కలిసి పోలీస్ స్టేషన్ లో వారి పేరెంట్స్ పై కేసు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నేరారోపణలకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

మొబైల్ ఫోన్ చూడొద్దు.. టీవీ చూడొద్దుఅంటూ తమను రోజూ తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతూ , తిడుతున్నారని 21 ఏళ్ల అమ్మాయి, 8యేళ్ల తమ్ముడితో ఇండోర్ లోని చందన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లెయింట్ స్వీకరించిన పోలీసులు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఏడేళ్లు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అయితే తల్లిదండ్రులు పిల్లల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2021 అక్టోబర్ 25న పిల్లలు తల్లిదండ్రులపై ఫిర్యాదు చేయగా.. అప్పటి నుంచి పిల్లలు వారి అత్త దగ్గర ఉండటం విశేషం.

స్థానిక మీడియా ప్రకారం.. పిల్లల ఫిర్యాదు తీసుకున్న పోలీసులు జువైనల్ యాక్ట్ కింద పేరెంట్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాకోర్టులో తల్లిదండ్రులు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తల్లిదండ్రులు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ అనంతరం జిల్లా కోర్టులో తల్లిదండ్రులపై ప్రారంభమైన విచారణపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.

న్యాయవాది ధర్మేంద్ర చౌదరి ప్రకారం.. తల్లిదండ్రులు హైకోర్టులో దాఖలు చేశారు. 2021 అక్టోబర్ 25 న పోలీసు స్టేషన్‌ లో తల్లిదండ్రులు తిట్టారని.. కొన్నిసార్లు మొబైల్ వాడినందుకు కొట్టారని పిల్లులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. దీంతో తమపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారని తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు.