IND vs AUS: ఇండోర్ లో నేడు రెండో వన్డే.. మ్యాచుకు వర్షం ముప్పు

IND vs AUS: ఇండోర్ లో నేడు రెండో వన్డే.. మ్యాచుకు వర్షం ముప్పు

ఆసియా కప్ నుంచి టీమిండియా అభిమానులకి వర్షం చిరాకు తెప్పిస్తుంది. శ్రీలంక, భారత్ లాంటి దేశాల్లో ఇది వర్షం సీజన్ కావడంతో ఎప్పుడు మ్యాచ్ జరుగుతుందో ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేని పరిస్థితి. శ్రీలంక దాటి వస్తే ఇక వర్షం ముప్పు లేదనుకున్న ఫ్యాన్స్ కి భారత్ లో కూడా నిరాశ తప్పేలా కనిపించడం లేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో కాసేపు వరుణుడు పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

ఏ టైంలో వర్షం పడుతుందంటే..?

ఇండోర్ వేదికగా నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డేలో వరుణుడు వచ్చేలాగే కనబడుతున్నాడు. వాతావరణ సమాచార ప్రకారం ఉదయం 9 గంటలకు కొన్ని ప్రాంతాల్లో అదే విధంగా సాయంత్రం 6 గంటలకు మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే మిగిలిన సమయాల్లో మాత్రం ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ నివేదిక తెలిపింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచుకు అంతరాయం కలిగితే 20 ఓవర్లకి మ్యాచుని కుదిస్తారు. అలా కూడా సాధ్యం కాకపోతే మ్యాచుని రద్దు చేస్తారు.

Also Read :- ఫైనల్కు చేరిన టీమిండియా..పతకం గ్యారెంటీ

1-0 ఆధిక్యంలో భారత్  

ఇక మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మరి నేడు జరగనున్న వన్డేలో భారత్ గెలిచి సిరీస్ గెలుచుకుంటుందా..? లేకపోతే ఆసీస్ గెలిచి సిరీస్ ని సమం చేస్తుందో చూడాలి. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈ నెల 27 న జరుగుతుంది.

<