2022 బెస్ట్స్మార్ట్ సిటీగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నిలిచింది. 100 స్మార్ట్ సిటీలలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన సిటీగా గుర్తింపు పొందింది. గత ఆరేళ్లుగా వరసగా పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ నిలిచింది. ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్ కాంటెస్ట్ నాల్గవ ఎడిషన్ లో సూరత్, ఆగ్రా నగరాలు వరుసగా రెండు, మూడు విజేతలుగా నిలిచాయి. న్యూటౌన్ రెండు అవార్డులను సొంతం చేసుకుంది. మొబిలిటీలో రెండో బహుమతి, బిల్ట్ ఎన్విరాన్ మెంట్ లో మూడో బహుమతి పొందింది.
శుక్రవారం ప్రకటించిన 2022 ఫలితాల ప్రకారం..రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, తమిళనాడు వరుసగా మొదటి, రెండవ ఉత్తమ పనితీరు కనబర్చగా, రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ సంయుక్తంగా మూడవ స్లాట్‌ను కైవసం చేసుకున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ అత్యధిక స్కోర్‌ను సాధించింది. సెప్టెంబర్ 27న ఇండోర్ లో విజేతలను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సత్కరిస్తారని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.