డబుల్ ఇంజిన్ కాదు..ట్రబుల్ ఇంజిన్ సర్కార్

డబుల్ ఇంజిన్ కాదు..ట్రబుల్ ఇంజిన్ సర్కార్

నిర్మల్, వెలుగు: ఆదిలాబాద్ స‌‌‌‌భ‌‌‌‌లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలు అర్థరహితమని అట‌‌‌‌వీ, ప‌‌‌‌ర్యావ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌, దేవాదాయ శాఖ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదన్నారు. ‘బీజేపీ ప్రభుత్వానిది డబుల్ ఇంజిన్ కాదు.. ‘ట్రబుల్ ఇంజిన్ సర్కార్’ అని ఎద్దేవా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌‌‌‌ల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి క‌‌‌‌ర్రు కాల్చి వాత పెట్టడం ఖాయ‌‌‌‌మ‌‌‌‌న్నారు. 

కారు స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో ప‌‌‌‌దిలంగా ఉందని... బీజేపీ స్టీరింగ్ మాత్రం ఆదానీ లాంటి కార్పొరేట్ల చేతుల్లో ఉందన్నారు. బీజేపీ నేతల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. అమిత్‌‌‌‌ షా తెలంగాణ‌‌‌‌కు ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతాడని‌‌‌‌‌‌‌‌, నోటికొచ్చిన ఆరోపణలు చేసి పోతాడని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై ఆయనకు కొంచమైనా అవగాహన లేదన్నారు. ఇక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. రైతుల ఆత్మహత్యలు, డ‌‌‌‌బుల్ బెడ్​రూం ఇండ్లు, ఆదివాసీల సంక్షేమంపై మాట్లాడే అర్హత అమిత్ షాకు లేద‌‌‌‌న్నారు. 

బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, అలాంటి వారా మాకు నీతులు చెప్పేది? అని అన్నారు. ఆదిలాబాద్ లో సీసీఐ పున‌‌‌‌రుద్ధరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చినవారు ఒక విజన్ తో మాట్లాడాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తమ హక్కు అని అన్నారు. రాజకీయ లబ్ధి పొందాలనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.