ఆసిఫాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల అప్రమత్తంగా ఉంటూ విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో అడిషనల్ కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సెక్టోరల్ అధికారులతో ఈవీఎం, వీవీ ప్యాట్లపై రెండో రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైందని
తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పన, ఈవీఎం, వీవీ ప్యాట్లు, హ్యాండ్ బుక్, పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలుంటే వెంటనే రిటర్నింగ్ అధికారికి వివరాలతో నివేదిక అందించాలని కోరారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, సెక్టార్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.