
- ఇప్పటి వరకు గుర్తించని అమరుల వివరాలు సేకరిస్తం
- ఇంద్రవెల్లి అమరువీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెల్లడి
- ఆదివాసీలది త్యాగాల జాతి అని ప్రశంస
- తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం
- భారీగా తరలివచ్చిన ఆదివాసీలు
ఆదిలాబాద్/గుడిహత్నూర్, వెలుగు: ఆదివాసీలది త్యాగాల జాతి అని మంత్రి సీతక్క అన్నారు. వారి పోరాటాలు చూస్తే కాకతీయులపై సమ్మక్క సారలమ్మ .. బ్రిటిష్ పాలకులకు వ్యతి రేకంగా బిర్సా ముండా, రాంజీగోండు, నిజాంపై పోరాడిన కొమురం భీం గుర్తుకొస్తారని పేర్కొ న్నారు. వారంతా ఆదివాసీ ప్రజల కోసం పోరాడి అమరులయ్యారని గుర్తుచేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో తొలిసారి ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు.
ఈసందర్భంగా అమరుల స్తూపం వద్ద ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్, ప్రేమ్ సాగర్ రావు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్సీ దండే విఠల్, అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్కట్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సీతక్క పూజలు చేశారు. అమరులకు నివాళులర్పించి మాట్లాడారు. ఇంద్రవెల్లి అమరవీరులను ఆదుకుంటామని గతంలోనే హామీ ఇచ్చామని, అందులో భాగంగానే అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని మంత్రి పేర్కొన్నారు.
అమరుల కుటుంబసభ్యులకు వారిక్వాలిఫికేషన్ ను బట్టి ఆయా శాఖలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆనాడు ఇంద్రవెల్లి ఘటనలో చాలా మంది చని పోయారని, వారి వివరాలు బయటకు రాలేదని, త్వరలోనే ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో ఎవరెవరు చనిపోయారన్న వివరాలు సేకరించేందుకు కమిటీ వేస్తామన్నారు. ఇంద్రవెల్లి ఘటన దురదృష్టకరమ ని, ఆ ఘటనపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. 44 ఏళ్లలో అమరులకునివాళులు అర్పించడంలో అనేక ఇబ్బం దులు ఎదుర్కొన్నారని, మొదటిసారి అధికారికంగా ప్రభుత్వం ఇంద్రవెల్లి అమరులకు నివాళులు అర్పిం చడం సంతోషంగా ఉందన్నారు.
గిరిజన ప్రజాప్ర తినిధులతో హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఏజెన్సీలో వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎండాకాలంలో నీటి కొరత తీర్చేందుకు ఏజెన్సీలో చెక్ డ్యాంలు నిర్మిస్తామని, ఇందిర గిరి వికాసం కింద ఫ్రీగా బోర్లు వేసి సోలార్ పంపుసెట్లు ఇస్తామని చెప్పారు. ఇంద్రవెల్లి స్మృతివ నం ఈ ఏడాది ఆగస్టు 9లోగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. కాగా.. ఇప్ప పువ్వును లడ్డుగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడంలో అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజన్ చేసిన కృషిని మంత్రి గుర్తుచేశారు.
ఇప్పపువ్వులడ్డు వల్ల బాలికలకు రక్తం పెరుగుతోందని, ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు. ఇక గిరిజన నిరుద్యోగుల కోసం ఉట్నూర్ కేబీకాంప్లెక్స్ లో హెవీ మోటార్ వెహికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను సీతక్క ప్రా రంభించారు. ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో స్టెమ్ సైన్స్ ల్యాబ్ను కూడా ప్రారంభిం చారు. దేవుగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం బెంచీలు అందజేశారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలకు ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు అందజేశారు.