కొలువుల్లోకి కొత్త కానిస్టేబుల్స్​ ఎనిమిది వేల మంది

హైదరాబాద్‌‌, వెలుగు: పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌లో కొత్తగా 8,047 మంది కానిస్టేబుల్స్‌‌ చేరబోతున్నారు. 2,338 మహిళా కానిస్టేబుల్స్‌‌ సహా సివిల్‌‌, ఆర్మ్​డ్​రిజర్వ్‌‌, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్‌‌లో విధులు నిర్వహించనున్నారు. దీంతో పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌ను వేధిస్తున్న సిబ్బంది కొరత తీరనుంది. కానిస్టేబుల్​పోస్టుల కేటాయింపులతో ఆయా పోలీస్‌‌ స్టేషన్లలో ఖాళీలు కూడా భర్తీ కానున్నాయి. హైదరాబాద్​లోని రాజ్​బహదూర్‌‌ వెంకటరామరెడ్డి(ఆర్​బీవీఆర్​ఆర్) పోలీస్ అకాడమీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా19 పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్‌‌(పీటీసీ)లో 2024 బ్యాచ్‌‌ స్టైపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్(ఎస్‌‌సీటీపీసీ) 9 నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి 

చేసుకున్నారు. గురువారం వారు పాస్‌‌ అవుట్‌‌ అయ్యారు.హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా యూనిట్స్‌‌లోని ట్రైనింగ్ సెంటర్స్‌‌లో కానిస్టేబుళ్ల 4వ దీక్షాంత్‌‌ పరేడ్‌‌ ఘనంగా జరిగింది. ఈ పరేడ్‌‌‌‌‌‌‌‌‌‌కు డీజీపీ ర్యాంకు అధికారులతో పాటు అడిషనల్‌‌‌‌‌‌‌‌ డీజీలు, ఐజీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర పోలీసు అకాడమీలో జరిగిన పరేడ్‌‌‌‌‌‌‌‌కు డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌ చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 1,211 మంది మహిళా కానిస్టేబుల్స్‌‌‌‌‌‌‌‌కు దిశానిర్దేశం చేశారు. 

ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లో జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన ఉప్పునూతల సౌమ్య(ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. సౌమ్య పరేడ్‌‌‌‌‌‌‌‌ కమాండర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించారు. ఇండోర్ పర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌లో బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆల్ రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కందుల మమత, చింతల రమాదేవి.. అవుట్‌‌‌‌‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆల్ రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  సోనియా, వి కృష్ణవేణి.. ఫైరింగ్‌‌‌‌‌‌‌‌లో పెద్దోళ్ల ప్రకృతి, లొలుగు భవానీ ట్రోఫీలు అందుకున్నారు. విమెన్‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ కేడెట్స్ నిర్వహించిన పరేడ్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఉన్నతాధికారులతో పాటు తల్లిదండ్రులను ఆకట్టుకుంది.

సవాళ్లను అధిగమించాలి: డీజీపీ

రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత హింస పెరిగిందని.. ఇలాంటి సవాళ్లను అధిగమించాలని యువ కానిస్టేబుళ్లకు డీజీపీ జితేందర్​ సూచించారు. ప్రజలు, పౌరహక్కులను కాపాడేందుకే పోలీసులు పనిచేయాలన్నారు. పోలీసింగ్ అంటే అనేక సవాళ్లతో కూడుకున్నదని.. ప్రజలతో కలిసి పనిచేసినప్పుడే మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రైమ్‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్ చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాలు సవాల్‌‌‌‌‌‌‌‌గా మారాయన్నారు. 

కొత్త నేరాలపై దృష్టిపెట్టాలని, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కమ్యూనిటీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రజలంతా యూనిఫామ్‌‌‌‌‌‌‌‌ లేని పోలీసులేనని వెల్లడించారు. రాష్ట్ర పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో మహిళా రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు. ఈ బ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,338 మంది మహిళా పోలీసులు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసుకున్నారని తెలిపారు. అకాడమీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, డీజీ అభిలాష బిస్త్ మాట్లాడుతూ..ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఎక్కడైనా విజయం సాధించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు, సమాజం గర్వపడేలా పోలీస్ డ్యూటీ నిర్వహించాలని సూచించారు.

వెల్లివిరిసిన ఆనందం..

రాష్ట్రంలోని 19 పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో గురువారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమాల్లో ఆనందం వెల్లివిరిసింది. తొమ్మిది నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్లనున్న తమ పిల్లలను పోలీస్​యూనిఫాంలో చూసి తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోయారు. కొందరు వారిని గుండెలకు హత్తుకొని సంతోషం వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లు తమ పేరెంట్స్​తలపై టోపీ, చేతిలో తుపాకీ పెట్టి వారికి సెల్యూట్​ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో సెల్ఫీలు తీసుకొని సరదాగా గడిపారు. ఈ దృశ్యాలు చూపరుల కండ్లలోనూ ఆనంద బాష్పాలు తెప్పించాయి.

మా అమ్మ బీడీ వర్కర్​

మా నాన్న పోచన్న సౌదీలో ఉంటారు. అమ్మ బీడీ వర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నది. నాకు ఇద్దరు అక్కలు. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని నాకు చాలా కోరిక ఉండేది. డిగ్రీలో ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ ట్రైనింగ్ చేశాను. ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ రాసి కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌గా సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాను. గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఫైరింగ్‌‌‌‌‌‌‌‌లో  బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఫైరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ట్రోఫీ అందుకున్నాను. ఇటీవల వచ్చిన గ్రూప్‌‌‌‌‌‌‌‌ 4 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌లో కూడా నాకు జాబ్ వచ్చింది. కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌గా డ్యూటీ చేస్తూనే ఉన్నత ఉద్యోగాలకు ప్రిపేర్​అవుతా.  - పెద్దోళ్ల ప్రకృతి,(బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఫైరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)

డ్యూటీ చేస్తూ సివిల్స్​ రాస్త..

మాది పేద కుటుంబం. అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్‌‌‌‌‌‌‌‌(ఈసీఈ) చేశాను. బీటెక్ పూర్తి కాగానే 2022లో సీఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌లో జాయిన్‌‌‌‌‌‌‌‌ అయ్యాను. ఢిల్లీలో డ్యూటీ చేసేదాన్ని. అమ్మనాన్నలను చూసుకోవడంతో పాటు సివిల్స్‌‌‌‌‌‌‌‌ రాసి ఐపీఎస్ కావాలన్నది నా ధ్యేయం. ఆర్థిక పరిస్థితులు నాకు సహకరించలేదు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ పరీక్ష రాశాను. ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌గా సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాను. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లో ఆల్‌‌‌‌‌‌‌‌ రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాను. ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీసీగా డ్యూటీ చేస్తూనే సివిల్స్ రాస్తాను.
- ఉప్పునూతల సౌమ్య (ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)