నిజామాబాద్ నగరంలో నాలుగు, ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి కాలనీలోని ప్రధాన రోడ్లలో నీరు నిలిచి గుంతల మయంగా మారిపోయాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం అక్కడక్కడ తవ్వి పైన సిమెంట్ వేసి వదిలేశారు.
వర్షం కారణంగా సిమెంట్ ఎగిరిపోవడంతో నీరు నిలిచి గుంతలుగా మారిపోయాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీలోని ప్రధాన రోడ్లపై ఉన్న ఈ గుంతలను పూడ్చాలని స్థానికులు, కాలనీవాసులు కోరుతున్నారు.