-
ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి రాష్ట్ర రవాణాశాఖ పొన్నం ప్రభాకర్
ప్రయాణికులు సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ రీజియన్ మొత్తం 64 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించింది. ఇందులో తొలి విడతగా 13 బస్సులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. మంత్రితో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నగర మేయర్నీతూ కిరణ్ఉన్నారు.
నిజామాబాద్ టు సికింద్రాబాద్ జేబీఎస్ రూట్ లో నడుస్తాయి. బస్సు లు ఎలక్ట్రిక్ బ్యాటరీలతో నడుస్తాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో ముందుకు వెనుకకు పూర్తి ఎయిర్ బ్రేక్ సిస్టం ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు 4 సీసీ కెమెరాలు, వెహికల్ ట్రాకింగ్ సదుపాయం కూడా కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం కలిగిన బస్సులోని- సీట్లను అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. చార్జి: పెద్దలకు రూ. 360-, పిల్లలకు: రూ. 220 అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.