ఇండస్ టవర్స్ లాభం రూ.4,003 కోట్లు

ఇండస్ టవర్స్ లాభం రూ.4,003 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: మొబైల్ టవర్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలేషన్ కంపెనీ ఇండస్ టవర్స్ డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​ ఫలితాలను ప్రకటించింది. ఈసారి సంస్థ లాభం ఏడాది లెక్కన 159.9 శాతం పెరిగి రూ.4,003 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్ ​రెవెన్యూ 4.8 శాతం పెరిగి రూ.7,548 కోట్లకు చేరుకుంది. 

ఇబిటా 93.2 శాతం పెరిగి రూ.6,997 కోట్లకు చేరింది. మొత్తం టవర్ల సంఖ్య 2.34 లక్షలకు చేరింది. రిటర్న్​ఆన్​ ఈక్విటీ 33.5 శాతం నుంచి 46.1 శాతానికి పెరిగింది. ఈ క్వార్టర్​లో రూ.3,024 కోట్ల విలువైన  రిసీవబుల్స్​ను రైట్​బ్యాక్​ చేసింది.