ఇండస్ఇండ్ బ్యాంక్ డిప్యూటీ సీఈఓ రాజీనామా

ఇండస్ఇండ్ బ్యాంక్ డిప్యూటీ సీఈఓ రాజీనామా

న్యూఢిల్లీ: ఇండస్​ఇండ్​ బ్యాంక్ ​డిప్యూటీ సీఈఓ అరుణ్​ఖురానా తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అకౌంటింగ్​ లోపాల కారణంగా బ్యాంకుకు రూ.రెండు వేల కోట్ల దాకా నష్టం జరగడానికి తనదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇంటర్నల్​డెరివేటివ్స్​ని తప్పుగా లెక్కించడం వల్ల బ్యాంకుకు రూ.1,959.98 కోట్ల నష్టం వాటిల్లిందని ఇండిపెండెంట్ ​ప్రొఫెషనల్​ ఫర్మ్​గ్రాంట్​థార్న్​టన్​కొనుగింది. ఈ విషయాన్ని ఇండస్​ఇండ్​ బ్యాంక్​ ఆదివారం వెల్లడించింది. ఈ తప్పుకు ఎవరెవరు బాధ్యులో కూడా తెలియజేసిందని పేర్కొంది.