
ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టాల పరంపర కొనసాగుతోంది. ఒక్క ఏడాదిలో రూ. 80వేల కోట్ల నష్టాలను చవిచూసింది. షేర్ ధర 55 శాతం తగ్గింది. మంగళవారం (మార్చి11)ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ ధర 26 శాతం పడిపోయింది.ఇది వరసగా ఐదో సెషన్ లో నష్టాలను కొనసాగించింది. ఈ ప్రయివేట్ రంగ బ్యాంకు దాని డెరివేటివ్స్ పోర్ట్ పోలియాను ప్రకటించిన తర్వాత షేర్ ధర పడిపోయింది.
ఇంట్రాడేలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 26.01 శాతం పడిపోయి రూ.666.25 కనిష్ట స్థాయికి చేరాయి. దీనితో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ పడిపోయింది. జనవరి 2024 నుంచి కంపెనీ దాదాపు రూ.78వేల 762 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయింది. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.51వేల28 కోట్లుగా ఉంది.
ఇది యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ తో పోలిస్తే తక్కువ. ప్రస్తుతం యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఇది రూ.51వేల 326.07 కోట్లుగా ఉంది.మంగళవారం నాటి ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ పతనం 2020 నవంబర్ 3 తర్వాత ఇదే అత్యధికం.