ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ లాభం రూ. 2,124 కోట్లు

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ లాభం రూ. 2,124 కోట్లు

ముంబై: ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ జూన్​2023 తో ముగిసిన క్యూ 1 లో రూ. 2,124 కోట్ల నికర లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్​తో పోలిస్తే నికర లాభం 32.5 శాతం ఎగసింది. తాజా క్వార్టర్లో బ్యాంకు నెట్​ ఇంటరెస్ట్ ఇన్​కం కూడా 18 శాతం పెరిగి రూ. 5,863 కోట్లకు చేరింది. కిందటేడాది మొదటి క్వార్టర్లో ఈ ఎన్​ఐఐ రూ. 4,125 కోట్లు మాత్రమే. తాజా క్వార్టర్లో ప్రొవిజన్లు, కాంటింజెన్సీలు రూ. 992 కోట్లకు తగ్గాయి. 

ఏడాది కిందటి క్వార్టర్లో ఈ ప్రొవిజన్లు రూ. 1,251 కోట్లు. ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ ఎసెట్​ క్వాలిటీ జూన్​ 2023 క్వార్టర్లో నిలకడగా ఉంది. గ్రాస్​ఎన్​పీఏలు ఈ క్వార్టర్లో 2 శాతం పెరిగి రూ. 5,941 కోట్లకు చేరాయి. నెట్​నాన్​–పెర్​ఫార్మింగ్​ ఎసెట్స్​ (ఎన్​ఎన్​పీఏ)లు కూడా స్వల్పంగా ఎగసి రూ. 1,747 కోట్లయ్యాయి. ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో 18.40 శాతానికి చేరింది. 

బ్యాంకు ఇతర ఆదాయం తాజా జూన్​ క్వార్టర్లో 14 శాతం ఎక్కువై రూ. 2,210 కోట్లయింది. ఫీ ఇన్​కం 19 శాతం పెరిగింది. రిజల్ట్స్​ ప్రకటన నేపథ్యంలో బీఎస్​ఈలో ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ షేరు 0.17 శాతం తగ్గి రూ. 1,390.30 వద్ద క్లోజయింది.