
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మార్చి 11న ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 140 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22400 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఫలితంగా ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జొమాటో , పవర్ గ్రిడ్ ,కొటక్ మహీంద్రా, హెచ్ డీఎఫ్ సీ,హెచ్ సీఎల్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ,మారూతీ సుజూకీ, ఇండియా,ఐటీసీ, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు మార్చి 11న(మంగళవారం) వరుసగా ఆరో సెషన్‌లో కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు 20 శాతం కుప్పకూలాయి. దీని వల్ల ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో రూ.1,500 కోట్ల వరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. .
ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లలో డెరివేటివ్స్ లావాదేవీల వాల్యుయేషన్‌లో మార్పు కారణం షేర్లపై ప్రభావం చూపిందని తెలుస్తోంది. అలాగే ఇటీవల కంపెనీ CFO రాజీనామా, సీఈవో సుమంత్ కత్పలియా పదవి కాలం మూడు సంవత్సరాలకు బదులుగా ఒక సంవత్సరం పొడిగించారు. ఈ కారణాలు కూడా కంపెనీ షేర్లు పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది.